దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని కష్టాలు: అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని కష్టాలు: అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

ముంబై: వ్యవసాయంలో నష్టాలు, మొదలు పెట్టిన వ్యాపారం కలిసిరాక మహారాష్ట్రకు చెందిన యువ రైతు అప్పుల పాలయ్యాడు. ఎక్కువ మిత్తీల కారణంగా ఆయన చేసిన రూ. ఒక లక్ష అప్పు కొద్దిరోజుల్లోనే 74 లక్షలకు పెరిగింది. తన యావదాస్తిని అమ్మేసినా ఆ అప్పులు తీరలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో తన కిడ్నీని అమ్ముకుని అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన రైతు రోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదాశివ దుస్థితి ఇది. అప్పులవాళ్ల వేధింపుల కారణంగా తాను కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

తీస్కున్నది లక్ష, కట్టాల్సింది 74 లక్షలు

సాగులో నష్టాలు వస్తుండటంతో సదాశివ కొద్దిరోజుల కింద రూ.లక్ష అప్పు చేసి డెయిరీ వ్యాపారం ప్రారంభించారు. అయితే, వ్యాపారం ప్రారంభం కాకముందే ఆయన కొనుగోలు చేసిన ఆవులు చనిపోయాయి. రోజుకు రూ.10 వేల మిత్తీ కావడంతో.. చేసిన అప్పుకు వడ్డీలు కట్టేందుకు సదాశివ మళ్లీ అప్పులు చేశాడు. అలా మొత్తం అప్పు రూ.74 లక్షలకు చేరింది. దీంతో వాటిని తీర్చేందుకు డెయిరీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తనకున్న పొలం, ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంట్లోని విలువైన వస్తువులన్నీ అమ్మేశాడు.

అయినా, అప్పు తీరకపోవడంతో ఆ రైతు తన కిడ్నీ అమ్మేయాలని అనుకున్నాడు. ఓ ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నుంచి కంబోడియాకు వెళ్లి కిడ్నీ అమ్ముకోగా వచ్చిన రూ.8 లక్షలను తిరిగి వచ్చి అప్పులవాళ్లకు ఇచ్చేశాడు. అయితే, తాను వడ్డీవ్యాపారుల చేతిలో దారుణంగా మోసపోయానని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని సదాశివ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే ముంబైలోని సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాడు.