ఢిల్లీ పొల్యూషన్ పై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నిరసన

 ఢిల్లీ పొల్యూషన్ పై పెద్దపల్లి  ఎంపీ వంశీకృష్ణ నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్నంగా నిరసన తెలిపారు. పొల్యూషన్​ నియంత్రణకు పర్యావరణహిత రవాణా వ్యవస్థలే మార్గమని అన్నారు. తాను స్వయంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ బైక్‌‌పై ఆయన మంగళవారం పార్లమెంట్‌‌కు వచ్చారు. 

ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుందని.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. కాలుష్యం తగ్గించటంలో తన వంతు బాధ్యతగా ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చినట్లు స్పష్టం చేశారు ఎంపీ వంశీ కృష్ణ. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. 2025, డిసెంబర్ 16వ తేదీ ఉదయం లోక్ సభకు హాజరయ్యేందుకు కారులో కాకుండా.. ఎలక్ట్రిక్ బైక్ ను  స్వయంగా నడుపుకుంటూ పార్లమెంట్ కు వచ్చారు ఎంపీ  వంశీ కృష్ణ.

 - న్యూఢిల్లీ, వెలుగు