థాయ్లాండ్ నుంచి లూథ్రా సోదరుల డిపోర్ట్.. ఢిల్లీలో ల్యాండ్ కాగానే అరెస్ట్

థాయ్లాండ్ నుంచి లూథ్రా సోదరుల డిపోర్ట్.. ఢిల్లీలో ల్యాండ్ కాగానే అరెస్ట్

న్యూఢిల్లీ: గోవాలో అగ్ని ప్రమాదం జరిగిన నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్లు సౌరభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూథ్రా, గౌరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూథ్రాలను థాయ్ లాండ్ అధికారులు భారత్‎కు డిపోర్ట్ చేశారు. మంగళవారం వారు ఢిల్లీలో దిగిన వెంటనే ఢిల్లీ, గోవా పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గోవాలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు అరెస్టు భయంతో థాయ్​లాండ్​లోని ఫుకెట్ కు పారిపోయారు. దీంతో పోలీసులు వారిపై కేసును నమోదు చేశారు. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయడంతో థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఇటీవల లూథ్రా సోదరులను అరెస్టు చేశారు. తాజాగా వారిని ఇండిగో ఫ్లైట్‎లో ఢిల్లీకి పంపించారు.