V6 News

10 జట్లతోనే ఐపీఎల్ 2022

10 జట్లతోనే ఐపీఎల్ 2022
IPL-2021 సీజన్‌ను 10 జట్లతో నిర్వహించనున్నారనే ప్రచారానిపై నిన్న(సోమవారం) క్లారిటీ వచ్చింది . టోర్నీలో ప్రస్తుతం 8 టీంలుండగా మరో రెండు జట్లు పోటీపడనున్నాయని ప్రచారం జరిగింది. డిసెంబర్‌ 24న జరగనున్న బీసీసీఐ వార్షిక సమావేశం ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించారు. అయితే సమావేశానికి ముందే ఎనిమిది జట్లతోనే మెగా టోర్నీని నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఐపీఎల్‌ 2021 సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌ వేదికగా గురువారం బీసీసీఐ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆడే జట్లపై బీసీసీఐ స్పష్టత ఇవ్వనుంది. వచ్చే ఏడాది 8 టీంలతోనే టోర్నీ నిర్వహించి 2022 సీజన్‌ను మాత్రం 10 జట్లతో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.