IND vs NZ: గాయంతో వన్డే సిరీస్‌కు పంత్ దూరం.. రీప్లేస్ మెంట్ ప్రకటించిన బీసీసీఐ

IND vs NZ: గాయంతో వన్డే సిరీస్‌కు పంత్ దూరం.. రీప్లేస్ మెంట్ ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శనివారం (జనవరి 10) ప్రాక్టీస్ లో భాగంగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పంత్ పొత్తి కడుపుకి బంతి తగిలింది. గాయంతో ఇబ్బందిపడిన పడిన పంత్ ప్రాక్టీస్ ఆపేశాడు. ఆ తర్వాత పంత్ కు రెస్ట్ కావాల్సిందిగా డాక్టర్లు సూచించారు. దీంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. పంత్ అందుబాటులో లేకపోవడంతో బ్యాకప్ వికెట్ కీపర్ గా బీసీసీఐ ధృవ్ జురెల్ ను ఆదివారం (జనవరి 11) ప్రకటించింది. 

బీసీసీఐ విడుదల చేసిన పత్రికలో ఇలా ఉంది. "పంత్ కు సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు.  మెన్స్ సెలక్షన్ కమిటీ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ను ఎంపిక చేసింది. త్వరలో జురెల్ జట్టులో చేరతాడు". అని బీసీసీఐ తెలిపింది. టీంఇండియాలో ప్రస్తుతం కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ ఉన్నాడు. రాహుల్ కు బ్యాకప్ గా మొదట ఇషాన్ కిషాన్ ను ఎంపిక చేస్తారని భావించినా సెలక్షన్ కమిటీ మాత్రం జురెల్ కు ఓటేసింది. 

విజయ్ హజారే ట్రోఫీలో పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రాహుల్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంత్ రాణించాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 212 పరుగులు చేసి కివీస్ తో సిరీస్ కు ముందు ఫామ్ లోకి వచ్చాడు. 2024 ఆగస్టు తర్వాత పంత్ టీమిండియా తరపున పంత్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. కివీస్ తో సిరీస్ లో తన అదృష్టం పరీక్షించుకుందామనుకున్నా గాయం రూపంలో బ్యాడ్ లక్ ఎదురైంది. 

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రస్తుతం న్యూజిలాండ్ 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. కాన్వే (36), నికోల్స్ (45) క్రీజ్ లో ఉన్నారు.