ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు వచ్చేయడంతో అందరి కళ్లూ ఇప్పుడు ప్లేఆఫ్స్ (Playoffs) పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకం షెడ్యూల్‌ను బోర్డు ఈరోజు అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఉత్కంఠభరితమైన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ భాగస్వామిగా 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' (District by Zomato) సంస్థను బీసీసీఐ ప్రకటించింది.
RuPay కార్డ్ హోల్డర్లకు స్పెషల్ ప్రిఫరెన్స్:
ఎప్పటిలాగే ఈసారి కూడా రూపై (RuPay) క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులకు బీసీసీఐ అదిరిపోయే ప్రీ-సేల్ విండో ఇచ్చింది. సాధారణ అభిమానుల కంటే.. 24 గంటల ముందే వీరు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రత్యేక విండోను ఓపెన్ చేయనున్నారు.
టికెట్లు ఎక్కడ, ఎలా బుక్ చేసుకోవాలి?
ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను స్టేడియంలో లైవ్‌గా చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ క్రింది అఫీషియల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మే 26 నుంచి ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్-1తో ఈ అసలైన యుద్ధం మొదలుకానుంది. టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాబట్టి, బీసీసీఐ ప్రకటించిన తేదీల్లో ఫ్యాన్స్ అలర్ట్‌గా ఉండటం బెటర్.
* ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్: www.iplt20.com
* డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్/వెబ్‌సైట్: www.district.in
ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్:
* క్వాలిఫయర్ 1 – మే 26, 2026 (హెచ్‌పిసిఎ క్రికెట్ స్టేడియం, ధర్మశాల)
* ఎలిమినేటర్ – మే 27, 2026 (న్యూ పిసిఎ స్టేడియం, న్యూ చండీగఢ్)
రూపీ ప్రాధాన్యత యాక్సెస్ విండో మే 22, 2026న ప్రారంభమవుతుంది:
* క్వాలిఫయర్ 2 – మే 29, 2026 (న్యూ పిసిఎ స్టేడియం, న్యూ చండీగఢ్)
* ఫైనల్ – మే 31, 2026 (నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్)
క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ కోసం నాన్-ఎక్స్‌క్లూజివ్ ఫేజ్ 1 టిక్కెట్ల అమ్మకాలు 2026, మే 21వ తేదీన ప్రారంభమవుతాయి, కాగా క్వాలిఫయర్ 2, ఫైనల్ కోసం ఫేజ్ 1 టిక్కెట్ల అమ్మకాలు 2026, మే 23వ తేదీన స్టార్ట్ అవుతాయి.
🚨 News 🚨#TATAIPL 2026 Playoffs tickets to go live from May 20
— IndianPremierLeague (@IPL) May 18, 2026
More Details ▶️ https://t.co/2Yxcyegc1q#KhelBindaas pic.twitter.com/WJjdcurLhB
