V6 News

బీసీసీఐ ఆస్తి రూ.14 వేల కోట్లు

బీసీసీఐ ఆస్తి రూ.14 వేల కోట్లు
న్యూఢిల్లీ: వరల్డ్‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌ పెద్దన్న బీసీసీఐ ఖజానా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2018–19 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ ఎండింగ్‌‌కు బోర్డు ఆదాయాన్ని రూ. 14,489.80 కోట్లుగా లెక్కగట్టారు. లేటెస్ట్‌‌ బ్యాలెన్స్‌‌ షీట్‌‌ ప్రకారం ఆ  ఏడాది బీసీసీఐ మొత్తంగా రూ. 4,017  కోట్లు సంపాదించగా.. అందులో సగం కంటే ఎక్కువ (రూ. 2407 కోట్లు)  కేవలం 2018 ఐపీఎల్‌‌ నుంచే రావడం విశేషం. అలాగే, ఇండియా టీమ్‌‌ మీడియా రైట్స్‌‌ అమ్మకం ద్వారా రూ. 825 కోట్లు సమకూరాయి. ఆ ఏడాది బోర్డు రూ. 1592 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఈ బ్యాలెన్స్‌‌ షీట్‌‌ను బోర్డు ఇంకా పబ్లిక్‌‌ డొమైన్‌‌లో పెట్టలేదు. అలాగే, 2019–20కి సంబంధించిన అకౌంట్స్‌‌ ఇంకా రెడీ కాలేదని తెలుస్తోంది. కానీ, ఈ నాలుగైదేళ్లలో బోర్డు ఆదాయం భారీగా పెరగడం విశేషం. 2014–15 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో బోర్డు నెట్‌‌ వర్త్‌‌ రూ. 5,438 కోట్లు కాగా.. తర్వాతి ఏడాది ఏకంగా 2408 కోట్లు ఆర్జించడంతో 2015–16లో ఆదాయం రూ.7847 కోట్లకు చేరింది. ఇక, 2016–17లో  8 వేల కోట్లు దాటింది. ఇంకో ఏడాదిలో ఏకంగా రూ. 3,460 కోట్లు అర్జించిన  బోర్డు ఖజానా 2017-–18 సీజన్‌‌లో  రూ. 11,892 కోట్లకు పెరిగింది. తాజా బ్యాలెన్స్‌‌ షీట్‌‌ ప్రకారం 2019 మార్చి 31 నాటికి బోర్డు నెట్‌‌ వర్త్‌‌ రూ. 14, 489 కోట్లకు చేరుకుంది. For More News.. ఫస్ట్​ఫేజ్లో రెండు స్కైవేలు.. వారంలో ఉప్పల్, మెహిదీపట్నంలో పనులు స్టార్ట్ మూలనపడ్డ ‘ఫీడ్​ ద నీడ్’​ సెంటర్లు ఫోన్‌లో మాట్లాడొద్దన్నందుకు యువతి సూసైడ్