
ముంబై: బీసీసీఐ ఆదేశాలను సౌత్ జోన్ బేఖాతరు చేసింది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్నటీమిండియా: స్టార్ ప్లేయర్లను తమ దులీప్ ట్రోఫీ జట్టులో చేర్చు కోవాలన్న బోర్డు ఆదేశాలను సౌత్ జోన్ పాటించలే దు. ఇప్పటికే ప్రకటించిన సౌత్ జోన్ టీమ్ లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, ప్రసిద్ కృష్ణ లేరు.
ఆగస్టు 28న ఈ జోనల్ రెడ్ బాల్ టోర్నీ మొదలవనుండగా.. స్టార్ ప్లేయర్లను టీమ్లోకి తీసుకునే అవకాశాలు. కనిపించడం లేదు. కాంట్రాక్టు ప్లేయర్లను ఆడిం చాలని నెల రోజుల కిందటే బీసీసీఐ ఈ -మెయిల్ ద్వారా స్టేట్ క్రికెట్ అసోసియేషన్లను ఆదేశించిం ది. అయినా, సౌత్ జోన్ అధికారులు దీన్ని పట్టిం చుకోలేదు. ప్రస్తుతానికి గత నెల 26న ప్రకటిం చిన జట్టుతోనే తాము ముందుకు వెళ్తామని జోన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ టీమ్ లో కెప్టెన్ తిలక్ వర్మ మాత్రమే ఏకైక కాంట్రాక్ట్ ప్లేయర్.
అలా అయితే వాళ్లను రంజీ ట్రోఫీ లో ఆడించండి
జోనల్ జట్ల ఎంపికలో నేషనల్ సెలెక్టర్లకు ఎలాంటి పాత్ర ఉండకూడదని, ఒకవేళ బీసీసీఐ కచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే కాం ట్రాక్ట్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తప్పనిసరిగా ఆడించాలని సౌత్ జోన్ అధికారులు వాదిస్తు న్నారు. ఇండియా స్టార్ ప్లేయర్లను ఎప్పుడైనా ఇండియా-ఎ జట్టు మ్యాచ్లకు ఎంపిక చేయవ చ్చని, దులీప్ ట్రోఫీ కేవలం రంజీల్లో రాణించిన ఆటగాళ్లకే వేదికగా ఉండాలని అంటున్నారు. 'కేరళ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధించి కొద్దిలో టైటిల్ కోల్పోయింది.
ఈ సీజన్లో అద్భు తంగా ఆడిన కేరళ ప్లేయర్లు దులీప్ ట్రోఫీకి ఎంపిక కావడానికి పూర్తి అర్హులు. ఒకవేళ బోర్డు చెప్పినట్టు టీమిండియా ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే కేరళ క్రికెటర్లలో చాలా మందికి జోనల్ జట్టులో చోటు దక్కడు' అని ఓ సౌత్ జోన్ అధికారి తెలిపారు. కాగా, 15 మందితో కూడిన సౌత్ జోన్ టీమ్ లో కేరళ నుంచినలుగురు, హైద రాబాద్ నుంచి ముగ్గురు, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక స్టేట్స్ నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. జోనల్ సెలెక్షన్ భేటీలో ఈ టోర్నీకి కేవలం,డొమె స్టిక్ క్రికెట్లో రాణించిన వారినే ఆడించాలని తీర్మానం చేసి, ఈ నిర్ణయాన్ని కమిటీ మినిట్స్లో కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. దులీప్ ట్రోఫీ గత ఎడిషన్లో రన్నరప్ గా నిలిచిన సౌత్ జోన్ సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే సెమీఫై నల్స్కు నేరుగా క్వాలిఫై అయింది. తమ తొలి మ్యాచ్కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ ప్రయాణ, వసతి ఏర్పాట్లు ఇప్పటికే ఖరారైనందున టీమ్లో మార్పులు చేసే అవకాశం లేదని సౌత్ జోన్ అధి కారులు చెబుతున్నారు.
ఇతర జోన్ల బరిలో స్టార్లు
సౌత్ జోన్ రంజీ పెర్ఫామెన్స్ ఆధారంగా టీమ్ను ఎంపిక చేయగా.. ఇతర జోనల్ సెలెక్టర్లు మాత్రం బీసీసీఐ ఆదేశాలను పాటించారు. పలువురు కాంట్రాక్ట్ ఆటగాళ్లను ఎంపిక చేశారు. సెంట్రల్ జోన్ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్ ఉన్నారు. ఈస్ట్ జోన్.. పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్, ఆకాశ్ దీప్ను ఎంపిక చేసింది. వెస్ట్ జోన్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్లను తీసుకోగా.. నార్త్ జోన్ శుభ్మన్ గిల్, అర్షీప్ సింగ్, హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.
గిల్ కు అనారోగ్యం.. దులీప్ ట్రోఫీకి దూరం!
ఇండియా టెస్టు టీమ్ కెప్టెన్ శుభ ్మన్ గిల్ దులీప్ ట్రోఫీకి దూరం కానున్నాడు. నార్త్ జోన్ టీమ్కు కెప్టెన్గా ఎంపికైన గిల్ అనారోగ్యం కారణంగా బరిలోకి దిగడం లేదని సమాచారం. ఒకవేళ గిల్ ఫిట్గా ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ మొత్తం ఆడేవాడు కాదు. ఆసియా కప్ కోసం ఇండియా టీమ్ తో కలిసి సెప్టెంబర్ తొలి వారంలోనే దుబాయ్ కు వెళ్లనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గ్రౌండ్లో జరగనున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్, ఈస్ట్ జోన్తో తలపడనుంది. కాగా, నార్త్ జోన్ జట్టును ప్రకటించే సమయంలోనే సెలెక్టర్లు గిలక్కు ప్రత్యామ్నాయంగా శుభమ్ రోహిల్లాను ఎంపిక చేశారు. ఇప్పుడు గిల్ జట్టు నుంచి తప్పుకుంటే వైస్ కెప్టెన్ అంకిత్ కుమార్ దులీప్ ట్రోఫీలో ఆ టీము నాయకత్వం వహించనున్నాడు.