ఇండియాలో ఆడలేము.. బంగ్లాదేశ్ డిమాండ్పై స్పందించిన BCCI

ఇండియాలో ఆడలేము.. బంగ్లాదేశ్ డిమాండ్పై స్పందించిన BCCI

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ (BCB) పై బీసీసీఐ స్పందించింది. 2026 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా తాము ఇండియాలో ఆడలేమని.. వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా చేస్తున్న డిమాండ్ పై శనివారం (జనవరి 10) స్పందించింది. 

శనివారం అత్యవసర సమావేశం తర్వాత.. ఈ అంశంపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడారు. బీసీబీ డిమాండ్ పై తామా చర్చించలేదని తెలిపారు. అది తమ పరిధిలోకి రాదని పేర్కొన్నారు.  మీటింగ్ CoE, ఇతర క్రికెట్ కు సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగినట్లు చెప్పారు. 

బంగ్లాదేశల్ లో హిందువులపై జరుగుతున్న దాడుల కారణంగా.. ఇండియాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఆ దేశ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపీఎల్-2026 స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయాల్సిందిగా కోల్ కతా నైట్ రైడర్స్ (KKR)ను బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే. 

ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బంగ్లా క్రికెట్ బోర్డు.. భద్రతా కారణాల రీత్యా 2026 టీ20 వరల్డ్ కప్ లో తమ  మ్యాచ్ వేదికలను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ICC)కి లేఖ రాసింది. ఈ అంశంపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న BCCI ఎట్టకేలకు స్పందించింది. ఆ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది.