BCCI పొరపాటు : తప్పుగా భారత్ స్కోర్ పోస్ట్

BCCI పొరపాటు : తప్పుగా భారత్ స్కోర్ పోస్ట్

సౌతాంప్టన్ వేదికగా శనివారం అఫ్ఘానిస్థాన్, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో  BCCI తప్పుడు స్కోర్ ను అప్డేట్ చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 రన్స్ చేసింది. అయితే భారత్ స్కోర్ 223/8 గా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది BCCI. దీంతో నెటిజన్లు BCCI అంత తొందరెందుకో కాస్త కరెక్ట్ గా చూసి పోస్ట్ చేయాలంటూ రీ ట్వీట్స్ చేశారు. 3 నిమిషాల వరకు అలాగే ఉండటంతో ఈ లోపు ఈ ట్వీట్ స్ర్కీన్ షాట్స్ రూపంలో చక్కర్లు కొట్టింది. అప్రమత్తమైన BCCI మరో పోస్ట్ లో సరైన స్కోర్ పెట్టింది. ఫస్ట్ పోస్ట్ కి వచ్చిన నెగెటివ్ కామెంట్లని డిలీట్ చేసింది BCCI.

https://twitter.com/BCCI/status/1142417298214572032