శిఖర్ ధావన్ కు ఇదో కొత్త సవాల్

శిఖర్ ధావన్ కు ఇదో కొత్త సవాల్

ఇప్పటిదాకా ఓపెనర్​గా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆరంభించి... తన ధనాధన్‌‌‌‌‌‌‌‌ ఆటతో ఎన్నోసార్లు టీమ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించి తొడగొట్టిన శిఖర్​ ధవన్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు సరికొత్త సవాల్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్నాడు..! టీమిండియాలో సీనియర్ ప్లేయర్​ అయిన ధవన్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా టీమ్‌‌‌‌‌‌‌‌ను నడిపించబోతున్నాడు..!  టెస్టు స్పెషలిస్టులు, పలువురు సూపర్​ స్టార్లతో కూడిన కోహ్లీసేన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్​లో ఉండగా... శ్రీలంక టూర్​లో లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఓవర్ల టీమ్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్సీ వహిస్తున్నాడు..! ఈ కొత్త సవాల్‌‌‌‌‌‌‌‌ను స్వీకరించేందుకు తాను రెడీ అని ధవన్‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు...! కెరీర్​లో తొలిసారి సీనియర్​ టీమ్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్సీ వహించేందుకు  చాలా ఎగ్జైటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నానని చెప్పాడు..! అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో లంకలో రాణిస్తామని, చాలా కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నానని చెప్పాడు..! మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ధవన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా, రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న సెకండ్‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ లంకకు పయనమైంది..! 

ముంబై: ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ను లీడ్‌‌‌‌‌‌‌‌ చేయడం తనకు  కొత్త సవాల్ అని శిఖర్ ధవన్‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. ఈ నెల 13 నుంచి జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ల్లో ధవన్​ కెప్టెన్సీలోని ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ ఆదివారం  శ్రీలంకకు పయనమైంది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ ముగించుకున్న 20 మంది మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌.. హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌తో కలిసి సమరోత్సాహంతో లంకకు బయల్దేరింది. ఈ ఇయర్ ఎండ్‌‌‌‌‌‌‌‌లో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌నకు ముందు ఆడనున్న ఈ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఓవర్ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో ధవన్‌‌‌‌‌‌‌‌, భువనేశ్వర్, హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా వంటి సీనియర్లతో పాటు ఆరుగురు అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ టూర్​లో సత్తా చాటి టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌ దక్కించుకోవాలని సీనియర్లతో పాటు యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నారు. టూర్​కు బయల్దేరే ముందు జరిగిన వర్చువల్‌‌‌‌‌‌‌‌ మీడియా కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో కోచ్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ధవన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడాడు. ఈ టూర్​కు ముందు రెండు వారాల క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ తమకు చాలా ఉపయోగపడిందని ధవన్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్లేయర్ల మధ్య టీమ్‌‌‌‌‌‌‌‌ బాండింగ్‌‌‌‌‌‌‌‌ పెరిగిందని, అది గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌పై  ప్రభావం చూపిస్తుందని చెప్పాడు.  

అంతా కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌గా....

పలువురు కొత్త ఆటగాళ్లతో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌ చాలా బాగుందని ధవన్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ‘ఇది చాలా మంచి టీమ్‌‌‌‌‌‌‌‌. అందరిలో పాజిటివిటీ, కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఈ టూర్​లో సత్తా చాటుతాం అని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో అందరిలో చాలా ఉత్సాహం ఉంది. నా వరకు ఇది కొత్త చాలెంజ్‌‌‌‌‌‌‌‌.  అలాగే, మా టాలెంట్‌‌‌‌‌‌‌‌ను చూపించేందుకు ఇదో గొప్ప అవకాశం. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నారు’ అని చెప్పాడు.

కుర్రాళ్లు బాగున్నారు

ఈ టూర్​లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్​ దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌, పృథ్వీ షా బరిలోకి దిగడం ఖాయంగా  కనిపిస్తోంది. వీరితో పాటు రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌, వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్​ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, స్పిన్‌‌‌‌‌‌‌‌ ద్వయం యుజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ కూడా చాన్నాళ్ల తర్వాత కలిసి ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది.  ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా సీనియర్లు, యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌తో టీమ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌గా ఉందని ధవన్‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. ‘కుర్రాళ్లు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం ఎదురు చూస్తున్నారు. టీమ్‌‌‌‌‌‌‌‌లోని చాలా మంది ప్లేయర్లు ఇప్పటికే బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా టీమ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌, యూత్‌‌‌‌‌‌‌‌తో చాలా బాగుంది. అందరు ప్లేయర్ల మధ్య సానుకూల వాతావరణం తేవడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టా. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా టీమ్‌‌‌‌‌‌‌‌ను నడిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా టీమ్‌‌‌‌‌‌‌‌గా నడిపించే చాన్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నా. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఓ టీమ్‌‌‌‌‌‌‌‌గా మేం రాహుల్‌‌‌‌‌‌‌‌ భయ్యా (ద్రవిడ్)తో కలిసి పని చేసేందుకు ఆతృతగా ఉన్నాం. ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌లో నేను ఓసారి ఇండియా-–ఎ తరఫున ఆడా. కాబట్టి ప్రస్తుత టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అందరం బాగా కలిసిపోతామనుకుంటున్నా. కోచ్‌‌‌‌‌‌‌‌, సపోర్ట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌, మేం అంతా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ఆతృతగా ఉన్నాం’ అని ధవన్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు. 

 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గడమే ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా-ఎ, అండర్-19 కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించి, ఎంతో మంది యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దిన రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలిసారి నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టూర్​ విషయంలో తన ఆలోచన చాలా క్లియర్​గా ఉందని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. టూర్​లో తమ ప్రధాన టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నెగ్గడమే అని చెప్పాడు. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు ముందు ఇండియాకు కేవలం 3 టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాత్రమే ఉండడం కాస్త నిరుత్సాహ పరిచే అంశం అన్నాడు. ‘టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్లేయర్లందరికీ బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందని చెప్పలేం. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా తమ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని చాలా ఆత్రుతగా  ఉన్నారు.ఈ టూర్​కు వస్తున్న సెలెక్టర్లు కుర్రాళ్ల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిశితంగా పరిశీలిస్తారు. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో చాలా మంది ప్లేయర్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, మా గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం ముందుగా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గడమే. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాగా రాణించిన వాళ్లకు మున్ముందు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఇక, టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంప్లిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే విషయంలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటా. ఒకసారి శ్రీలంకలో అడుగు పెట్టాక.. అందరితో మాట్లాడుతా. వాళ్ల ఆలోచనలు ఏంటో తెలుసుకుంటా’ అని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.