నాలుగు వేదికల్లో మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్‌‌లు.. 16న లీగ్‌‌‌‌ రీస్టార్ట్‌‌‌‌ చేసేందుకు బీసీసీఐ కసరత్తు..

నాలుగు వేదికల్లో మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్‌‌లు.. 16న లీగ్‌‌‌‌ రీస్టార్ట్‌‌‌‌ చేసేందుకు బీసీసీఐ కసరత్తు..
  • ఫైనల్‌‌‌‌ను కోల్‌‌‌‌కతా నుంచి అహ్మదాబాద్‌‌‌‌కు తరలించే చాన్స్‌‌‌‌
  • రేపటిలోపు ప్లేయర్లను తమ బేస్‌‌లకు రప్పించాలని ఫ్రాంచైజీలకు సూచన

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌లో మిగిలిన మ్యాచ్‌‌‌‌లను హైదరాబాద్ సహా నాలుగు వేదికల్లోనే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల16న లీగ్‌‌‌‌ను తిరిగి ప్రారంభించాలని, సాధ్యం కాకపోతే కాకపోతే 17న రీస్టార్ట్ చేసి మే 30 లేదా జూన్‌‌‌‌1న ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను కోల్‌‌‌‌కతా నుంచి అహ్మదాబాద్‌‌‌‌కు మార్చే  యోచనలో బోర్డు ఉంది. లీగ్ రీస్టార్ట్‌‌‌‌పై సోమవారం బోర్డు నుంచి ప్రకటన రావొచ్చు. ఈ నెల 10న లీగ్ ఆగిపోవడంతో స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్ ప్లేయర్లు, ఇతర ఆటగాళ్లను తిరిగి రప్పించి మంగళవారంలోపు  తమ బేస్‌లకు చేరుకోవాలని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూచించిందని సమాచారం. 

ఇండియా–పాకిస్తాన్ శనివారం కాల్పుల విరమణ ప్రకటించడంతో లీగ్‌‌‌‌ను రీస్టార్ట్ చేసే విషయంపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు ఆదివారం చర్చించారు. ఆట తిరిగి ప్రారంభించేందుకు అనువైన షెడ్యూల్‌‌‌‌ను రూపొందించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌ రాజీవ్ శుక్లా చెప్పారు. ‘ప్రస్తుతానికైతే ఐపీఎల్‌‌‌‌పై ఎలాంటి నిర్ణయం లేదు. బీసీసీఐ అధికారులు పరిష్కారాలపై పని చేస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీ, ఐపీఎల్‌‌‌‌ చైర్మన్, ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే నిర్ణయం వస్తుంది. లీగ్‌‌‌‌ను త్వరగా రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు.  

లక్నోలో ఆర్సీబీ–జెయింట్స్‌ పోరుతో రీస్టార్ట్‌‌‌‌

లక్నోలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు– లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌ మధ్య మ్యాచ్‌‌‌‌తో  ఆట తిరిగి షురూ అవుతుందని ఐపీఎల్‌‌‌‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ప్లే-ఆఫ్ దశకు సంబంధించి క్వాలిఫయర్,  ఎలిమినేటర్ మ్యాచ్‌‌‌‌లకు హైదరాబాద్ వేదికగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కానీ కోల్‌‌‌‌కతాలో ఫైనల్ మ్యాచ్‌‌‌‌కు వర్షం అడ్డంకి కావచ్చు. 

ఈ ఫైనల్ బహుశా జూన్ 1న జరగవచ్చు. వర్షం కారణంగా ఫైనల్ అహ్మదాబాద్‌‌‌‌లో జరిగే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఢిల్లీ, ధర్మశాలలో మ్యాచ్‌‌‌‌లు నిర్వహించే చాన్స్ లేదు. ఈ రెండు వేదికల నుంచి ఇప్పటికే బ్రాండ్‌‌‌‌కాస్టింగ్‌‌‌‌, ఇతర పరికాలను  తొలగించారు.

ప్రాక్టీస్ షురూ చేసిన గుజరాత్ టైటాన్స్

ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌‌‌‌–ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోవడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయిస్తారని తెలుస్తోంది. లీగ్‌‌‌‌ను తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వ సమ్మతి కూడా అవసరం అవుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పారు. ‘తొందర్లోనే మిగిలిన మ్యాచ్‌‌‌‌లను నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు, బ్రాడ్‌‌‌‌కాస్టర్లు, స్పాన్సర్లు, రాష్ట్ర సంఘాలతో సంప్రదింపులు చేస్తాం.  

లీగ్ రీస్టార్ట్‌‌‌‌పై నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా కావాలి’ అని తెలిపారు.   మరోవైపు గుజరాత్ టైటాన్స్‌ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ఆదివారం అహ్మదాబాద్ స్టేడియంలో ప్లేయర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.