IPL 2025: ఫ్రాంచైజీలకు బిగ్ రిలీఫ్ ..తాత్కాలిక రీప్లేస్ మెంట్‌లకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

IPL 2025: ఫ్రాంచైజీలకు బిగ్ రిలీఫ్ ..తాత్కాలిక రీప్లేస్ మెంట్‌లకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాత్కాలిక రీప్లేస్ మెంట్ లు ప్రకటించుకోవచ్చు అని చెప్పడంతో ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చున్నారు. ఐపీఎల్ 2025 లో స్టార్ ప్లేయర్స్ మిగిలిన మ్యాచ్ లకు దూరం అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ శుభవార్త చెప్పి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీని ప్రకారం తమ జట్లలోని విదేశీ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఇప్పుడు 10 ఫ్రాంచైజీలు రీప్లేస్ మెంట్ లపై దృష్టి  సారించారు.

"జాతీయ నిబద్ధతలు లేదా వ్యక్తిగత కారణాలు లేదా ఏదైనా గాయం లేదా అనారోగ్యం కారణంగా కొంతమంది విదేశీ ఆటగాళ్ళు అందుబాటులో లేకపోవడంతో, ఈ టోర్నమెంట్ ముగిసే వరకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఆటగాళ్లను అనుమతిస్తారు" అని లీగ్ ఫ్రాంచైజీలకు ఒక మెమోలో తెలిపింది. ఈ రూల్ ప్రకారం తాత్కాలిక ప్రత్యామ్నాయ ఆటగాళ్లు వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకునే అవకాశం లేదు. వారు 2026 ఐపీఎల్ మినీ వేలంలో తమ పేరును నమోదు చేసుకోవాలి". అని బీసీసీఐ తెలిపింది    

ప్రస్తుతానికి, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ జామీ ఓవర్టన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ మాత్రమే టోర్నమెంట్ లోని   మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు.  జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను రీప్లేస్ మెంట్ గా ప్రకటించింది. ఓవర్టన్ కు రీప్లేస్ మెంట్ ప్రకటించలేదు. మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్ , ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ వంటి వారు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండరు. వీరు మే 25 వరకు ఇండియాలో ఉండనున్నారు. ఆరుగురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు, సౌతాఫ్రికా లో 8 మంది క్రికెటర్లు లీగ్ చివరి వరకు ఉండరని తెలుస్తోంది. 

ఐపీఎల్‌‌‌‌18వ సీజన్‌‌‌‌ రీస్టార్ట్‌‌‌‌ అవుతుండటంతో అభిమానులు ఆనందంగా ఉన్నా..  స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్ ప్లేయర్లు తిరిగి వస్తారా? లేదా? అనే విషయం బీసీసీఐ, లీగ్ ఫ్రాంచైజీలను కలవరపెట్టింది. ఈ నెల 17 నుంచి లీగ్‌‌‌‌ తిరిగి ప్రారంభం కానుండగా ప్లేయర్లను ఇండియాకు పంపించాలని బీసీసీఐ, ఫ్రాంచైజీలు  ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ  తాత్కాలిక ప్రత్యామ్నాయ ఆటగాళ్లను రీప్లేస్ మెంట్ చేసుకోవచ్చని బిగ్ రిలీఫ్ ఇచ్చింది.  

ఐపీఎల్‌‌‌‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లలో చాలా మంది తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉండగా ఒకరిద్దరు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌కు ఆడుతున్న ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ మార్కస్ స్టోయినిస్‌‌‌‌, జోష్ ఇంగ్లిస్‌‌‌‌ తిరిగి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఈ ఇద్దరినీ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

కింగ్స్ టీమ్‌‌‌‌లోని ఆసీస్ ప్లేయర్లు జేవిర్ బార్ట్‌‌‌‌లెట్‌‌‌‌, ఆరోన్ హార్డీ, అఫ్గాన్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌, సౌతాఫ్రికన్ మార్కో యాన్సెన్‌‌‌‌ తిరిగి జట్టులో చేరనున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌‌‌‌  కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా మిగిలిన మ్యాచ్‌‌‌‌లు ఆడనున్నారు.  గుజరాత్ టైటాన్స్‌‌‌‌ బౌలర్లు కగిసో రబాడ, గెరాల్డ్ కోట్జీ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.    

ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు.. జూన్ 3 న ఫైనల్ జరగనుంది.