వచ్చే వారం ఆరు ఐపీఓలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఒకటి మెయిన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐదు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ

వచ్చే వారం ఆరు ఐపీఓలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఒకటి మెయిన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐదు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ

న్యూఢిల్లీ: ఈ నెల12 నుంచి 16 వరకు  ఆరు ఐపీఓలు  ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి.  వీటిలో అమాగి మీడియా ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్ ఐపీఓ కాగా, మిగతా ఐదు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ లిస్టింగ్స్. అదనంగా, భారత్ కోకింగ్ కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బీసీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లిస్టింగ్  కూడా ఇన్వెస్టర్ల దృష్టిలో ఉంది. బీసీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ మొదటి రోజే ఎనిమిది రెట్లు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రైబ్ అయింది. 

ఇష్యూ ధర రూ.23 కాగా,  గ్రే మార్కెట్‌‌‌‌లో 39 శాతం ప్రీమియం ఉంది. దీంతో ఈ ఐపీఓకి డిమాండ్ కనిపిస్తోంది. అమాగి మీడియా ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ జనవరి 13న ప్రారంభమై జనవరి 16న ముగుస్తుంది. షేరు ధర రూ.343–రూ.361  పరిధిలో రూ.1,789 కోట్లు సేకరించనుంది. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   నర్మదేష్ బ్రాస్ ఇండస్ట్రీస్, అవానా ఎలక్ట్రోసిస్టమ్స్, జిఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ రెన్యూ ఎనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్, ఇండో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, ఆర్మర్ సెక్యూరిటీ  ఐపీఓలు ఉన్నాయి.