ధైర్యంగా ఉండండి.. కాపాడకుంటాం.. ఆటో డ్రైవర్లకు హరీశ్ రావు భరోసా

ధైర్యంగా ఉండండి.. కాపాడకుంటాం.. ఆటో డ్రైవర్లకు హరీశ్ రావు భరోసా

కాంగ్రెస్ ప్రభుత్భం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతున్న విషయం తెలిసిందే. ఉచిత ప్రయాణ పథకం వల్ల తమ పొట్టకొడుతున్నారంటూ ఆటో రిక్షా డ్రైవర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు తమ కష్టాలు తెలియజేస్తూనే ఉన్నారు. 

మహాలక్ష్మి పథకం వల్ల.. 10 నుండి 30 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే మహిళా ప్రయాణికులు ఆటో రిక్షాలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని, తద్వారా తాము జీవనోపాధి కోల్పోతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే డ్రైవర్లు ఇప్పుడు 300 కూడా దాటడం లేదని చెప్తున్నారు. ఈ అరకొర డబ్బులతో ఈఎంఐలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో తాము నడి రోడ్డుమీద పడ్డామని వాపోతున్నారు. 

హరీశ్ రావు భరోసా

ఆటో డ్రైవర్ల కష్టాలను శ్రద్ధగా విన్న హరీశ్ రావు, తాముగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరుపున బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో గళం విప్పుతుందని ఆయన తెలిపారు. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఉపాధి సాయంగా ప్రభుత్వం నెలకు 10వేలు ఇచ్చేదాక పోరాటం చేద్దామని ఆయన మాట్లాడారు.