Tirumala: అలిపిరి నడకదారిలో చిరుత, ఎలుగుబంటి సంచారం..

Tirumala: అలిపిరి నడకదారిలో చిరుత, ఎలుగుబంటి సంచారం..

అలిపిరి-తిరుమల నడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం కొనసాగుతోంది. టీటీడీ,  అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్‌ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది. నడక మార్గంలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం సమీపంలో  ఎలుగుబంటి, చిరుత తిరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డైంది.  అలిపిరి నడక మార్గంలో అక్టోబర్ 24 నుంచి 27 తేదీ మధ్యలో అనేక సార్లు తిరుగున్నట్లు రికార్డైందని అధికారులు తెలిపారు.  ఎప్పటికప్పుడు జంతువుల సంచారాన్ని గుర్తిస్తున్నామని, ఆ మేరకు నడకదారిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ, అటవీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.