Vastu Tips: బెడ్రూంకు ఏ దిక్కులో బాల్కనీ ఉండాలి.. బావిని పూడ్చిన స్థలంలో గది నిర్మించవచ్చా..!

Vastu Tips: బెడ్రూంకు ఏ దిక్కులో బాల్కనీ ఉండాలి.. బావిని పూడ్చిన స్థలంలో గది నిర్మించవచ్చా..!

ఇల్లు నిర్మించుకున్నా.. కట్టిన ఇల్లు కొన్నా అందరూ తప్పకుండా వాస్తును పరిశీలిస్తారు.  పెద్ద పెద్ద అనుమానాలు కలగినప్పుడు వాస్తు పండితులను సంప్రదిస్తారు.  వాస్తుకన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్ తెలిపినవివరాల ప్రకారం  బెడ్రూమ్ కు ఏ దిక్కులో  బాల్కనీఉండాలి? గతంలో బావి ఉన్న ప్రదేశంలో గది నిర్మించవచ్చా..  బాత్రూం.. తలుపులు.. కిటికీలను కూడా లెక్కలోకి తీసుకోవాలా.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. .  . 

ప్రశ్న: బెడ్రూమ్​ కు  బాల్కనీ ఏవైపు ఏర్పాటు చేసుకుంటే మంచిది?

జవాబు: ఇల్లు ఫేసింగ్, బెడ్రూమ్ ఫేసింగ్ ఏవైపు ఉంటుంది అనేదాన్నిబట్టి నిర్ణయించాలి. 
అయితే తూర్పు, ఉత్తరం దిక్కుల్లో బాల్కనీ ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రశ్న:   ఇంటి పక్కన పాతబావి ఉంది. దాన్ని చాలా కాలం నుంచి వాడటంలేదు. ఇప్పుడు ఆ బావిని పూడ్చి ఆ ప్రదేశంలో చిన్న గది కట్టుకోవాలనుకుంటున్నాం. ..అది కరెక్టేనా?

జవాబు: పాతబావులు ఉన్న చోట ఇంటికి సంబంధించి ఎలాంటి నిర్మాణం చేయొద్దు. బావుల్ని పూడ్చిన చోట గార్డెన్ పెంచుకోవచ్చు. ఆ స్థలాన్ని ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు.

ప్రశ్న:  ఇంటి ద్వారాలు సరి సంఖ్యలో ఉండాలంటారు కదా. వాటిలో బాత్రూమ్ ద్వారాలు కూడా కలుపుకోవాలా?

జవాబు: ఇంట్లో ద్వారాలు, కిటికీలు అన్నీ సరి సంఖ్యలోనే ఉండాలి. వీటిలో బాత్రూమ్ ద్వారాలను కూడా లెక్కించాలి. అన్నీ సరిసంఖ్యలోనే ఉండేలా చూసుకోవాలి.

ప్రశ్న:  ఇంటికి దక్షిణంవైపు గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. వాస్తు ప్రకారం ఇది సరైనదేనా?

జవాబు: గోబర్ గ్యాస్ ప్లాంట్ భూమిపైన ఏర్పాటు చేస్తున్నారా లేదా భూమి లోపల ఏర్పాటు చేస్తున్నారా అనేది చూడాలి. భూమిలోపల అయితే దక్షిణంవైపు గుంట ఉండకూడదు. అందువల్ల దక్షిణ దిక్కు కాకుండా, వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు