బీరు, బిర్యానీకి బదులు మాస్కులు, శానిటైజర్లు

బీరు, బిర్యానీకి బదులు మాస్కులు, శానిటైజర్లు

గ్రేటర్ ఓటర్లకు గాలం వేయడానికి నేతల కొత్త ప్లాన్
హైదరాబాద్: ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తుంటారు. బీరు, బిర్యానీ ఇచ్చో, లేక నోట్లు పంచో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తుంటారు. అయితే కరోనా కాలంలో బీరు, బిర్యానీ కంటే మాస్కులు, శానిటైజర్లకే డిమాండ్ పెరిగింది. అందుకే పొలిటీషియన్స్ కూడా రూటు మార్చి ఓటర్లను గాలంలో వేయడానికి శానిటైజర్లు, మాస్కులను పంచుతున్నారు. త్వరలో హైదరాబాద్‌‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల నగరా మోగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిల్చోబోయే అభ్యర్థులు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా నేతలు వాలంటీర్లతో ఇంటింటికీ మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, గుడ్లను పంచుతుండటం విశేషం. మున్సిపల్ ఎన్నికలకు ముందు కనీసం మూడుసార్లు వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలుస్తోంది. వాలంటీర్లకు గంటకు రూ.100 చొప్పున ఎన్ని గంటలు పని చేస్తే అన్ని వందలు అప్పజెప్పుతున్నారని సమాచారం.