కర్నూల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం

కర్నూల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం

కర్నూల్ జిల్లా వెలుగోడులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. మద్రాసు కాలువ దగ్గర ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమార్ పై దాడి చేసింది. వల వేసి ఎలుగును పట్టుకునేందుకు ప్రయత్నించారు అధికారులు. అయితే వల తెగడటంతో ఆఫీసర్ పై దాడికి దిగింది ఎలుగుబంటి. దీంతో దాడిలో గాయపడిన ఆఫీసర్ ను ముందుగా స్థానిక ఆస్పత్రికి తలరించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో… మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.