కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ.. మంటల్లో ప్రయాణికులు సజీవదహనం

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ.. మంటల్లో ప్రయాణికులు సజీవదహనం

ఘోర బస్సు ప్రమాదం..అర్థరాత్రి ఢీకొన్న బస్సు, లారీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ప్రయాణికులు హాహాకారాలు.. మంటల్లో ప్రయాణికులు సజీవం దహనం.. కర్నూల్ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం..

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం  జరిగింది. గురువారం (డిసెంబర్ 25న) తెల్లవారు జామున కర్ణాటకలోని చిత్రదుర్గ్ జిల్లా హిరియూర్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు , లారీ  పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో సమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది.   

ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  చిత్రదుర్గ్ జిల్లా హిరియూర్ సమపీంలో గొర్లట్టు దగ్గర ప్రైవేట్ బస్సును , లారీ వేగంగా ఢీకొట్టింది. వేగంలో కంట్రోల్ తప్పిన లారీ డివైడర్ ఢీకొట్టి అవతలి వైపు వెళ్లి బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రయాణికులు నిద్రలోనే మంటల్లో కాలిపోయారు. పలువురు ప్రయాణికులు కాలిన గాయాలతో హిరియూర్ లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.