నగరంలో జోరుగా బీరు అమ్మకాలు

నగరంలో జోరుగా బీరు అమ్మకాలు
  • గత ఏడాది కంటే ఈ సారి రెట్టింపు అమ్మకాలు
  • సిటీలో 18 శాతం, రంగారెడ్డిలో 19 శాతం అధికం
  • నేడు అంతర్జాతీయ బీరు దినోత్సవం.!

గ్రేటర్​లో కాలంతో సంబంధం లేకుండా బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. న్యూ ఇయర్​ వేడుకల కన్నా మార్చిలో రెండు రెట్లు అధికంగా విక్రయాలు జరిగాయి. వేసవిలో చిల్​గా ఉండడానికి బీరు తాగడం సహజమే అయినా.. ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లు,లోక్​సభ ఎన్నికలు, పండుగల సంబురాలతో అమ్మకాలు పెరిగాయి. ఒక్క మే నెలలోనే హైదరాబాద్ జిల్లాలో 6.09 లక్షల కేస్ లు,  రంగారెడ్డి జిల్లాలో 15.97లక్షల కేస్​ల బీర్లు అమ్ముడుపోయాయి. సిటీ కన్నాశివారులోనే బీర్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.- హైదరాబాద్​, వెలుగు

హైదరాబాద్, వెలుగు : ఫ్రెండ్‌‌ షి ప్‌ డే.. మదర్స్‌‌డే, ఫాదర్స్‌‌డే, విమెన్స్‌‌ డే ఉన్నట్లు గా బీరు ప్రియులకు కూడా వరల్డ్‌ బీరు డే ఉంది. దీ న్ని ప్రపంచవ్యాప్తంగా 2007 నుంచి నిర్వహించుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో ఆగస్టు మొదటి శుక్రవారం వరల్డ్‌ బీరు డే ప్రారంభమైంది. ఈ రోజున బీరు ప్రియులకు బీ ర్లను గిఫ్ట్‌ గా ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. ఇక మన సిటీలోనూ బీరు ప్రియులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నారు. దీంతో గ్రేటర్ లో బీరుకు భారీగానే డిమాండ్ ఉంది.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బీరు అమ్మకాలు అధికంగా పెరిగాయి. సాధారణంగా సమ్మర్‌‌లోబీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫంక్షన్లు, పార్టీల్లో వైన్ తీసుకోని వారు చాలామంది బీరు తాగేందుకు ఇష్ట పడుతుంటారు. దీంతో అమ్మకాలు పెరిగిపోతున్నాయి. అన్ని రకాల మద్యం విక్రయాలను పరిశీలిస్తే బీరు వాటానే ఎక్కువగా ఉంటుం ది.

గ్రేటర్‌‌ పరిధిలో అమ్మకాలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతేడాది జనవరినుం చి జులై వరకు జరిగిన మద్యం అమ్మకాలవిలువ 2754.17 కోట్లు. ఈ ఏడాది జనవరినుం చి జులై 31 నా టికి జరిగిన అమ్మకాల విలువ3,248.65కోట్లు. కాగా ఈ ఏడాదిజులై నాటికి రంగారెడ్డి జిల్లాలో అమ్ముడుపోయిన బీర్ కేస్(ఒకకేస్‌ లో 12 బీర్లు )లు 88,23,517 కేసులుగాలెక్కలు చె బుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఘట్ కేసర్ పరిధిలో 9,16,439 కేస్ లబీర్లు అమ్ముడయ్యాయి. గ్రేటర్‌‌ పరిధిలో కోర్‌‌సిటీ కంటే శివారుప్రాంతాల్లో బీ ర్ల విక్రయాలుఎక్కువగా జరుగుతాయి.సికిం ద్రాబాద్, జూబ్లీహిల్స్,బంజారా హిల్స్ వంటి ప్రాంతా-ల్లో బీ ర్లతో పాటు ఫారెన్ వైన్, విస్కీల-కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.దీని కి కారణంఈ ఏరియాల్లో ధనిక వర్గాలనివసిం -చడమే.మల్కా జ్ గిరి,పటాన్ చెరు,కూకట్ పల్లి, ఎల్‌‌బీ-నగర్, ఉప్పల్,మెహదీపట్నం ,ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో బీ ర్ల అమ్మకాలుఅధికంగా ఉన్నాయి. గ్రేటర్ లో దాదాపు మద్యం దుకాణాలు, బార్లు 1000 కి పైగా ఉన్నాయి