ఓయూలో నెల రోజులు హాస్టల్స్, మెస్లు క్లోజ్

ఓయూలో నెల రోజులు హాస్టల్స్, మెస్లు క్లోజ్

ఉస్మానియా యూనివర్సిటీకి నెల రోజులు  సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అధికారులు. మే 1 నుంచి 31 వరకు  ఓయూ క్యాంపస్ లోని హాస్టల్స్, మెస్ లు క్లోజ్ చేస్తామని చెప్పారు. ఓయూలో ప్రస్తుతం ఉన్న  నీళ్లు, కరెంట్ కొరత కారణంగా అన్ని హాస్టల్స్ కు హాలీడేస్ ప్రకటిస్తున్నామని ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్   ప్రకటన విడుదల చేశారు.విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. 

యూనివర్శిటీలోని హాస్టల్స్ లో  కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని ఏప్రిల్ 27 రాత్రి ఓయూ విద్యార్థులు  రోడ్డుపై బైఠాయించి  ఆందోళన చేసిన సంగతి తెలిసిందే..వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించలేని స్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు.

గత 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన  వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్స్ లో  కనీస మాలిక వసతులు కల్పించలేకపోతున్నారని తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన చేపడుతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఓయూకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అధికారులు