17 ఎంపీ స్థానాలకు.. 625 మంది పోటీ

17 ఎంపీ స్థానాలకు.. 625 మంది పోటీ

తెలంగాణలో  లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపంహరణకు ఏప్రిల్ 29తో  గడువు ముగిసింది.  రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా..  ఇందులో  268 రిజెక్ట్ అయినాయి. పార్టీల బుజ్జగింపులతో కొందరు నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో  మొత్తం 17 స్థానాలకు  625  మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  నామినేషన్ల ఉపసంహరణ తర్వాత  ఆదిలాబాద్ లోక్ సభకు 12 మంది బరిలో ఉన్నారు.  మెదక్ లో అత్యధికంగా 53 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.   ఇవాళ సాయంత్రం తుది జాబితాను  ప్రకటించనుంది ఈసీ. 

 తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలకు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ,బీజేపీ, బీఆర్ఎస్ పోటీచేస్తున్నాయి. 14 సీట్లు టార్గెట్ గా  అధికార కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తోంది.