
కర్నూల్: ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఎండ 45 డిగ్రీలు దాటి దంచుతోంది. ఈ వేసవి తాపానికి బీర్ల లోడ్‌తో వెళ్తోన్న ఓ లారీ దగ్ధమైపోయింది. నంద్యాల ఆటో నగర్ దగ్గర ఈ ఘటన జరిగింది. నాకౌట్ బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. వెనువెంటనే లారీ మొత్తం వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటలకు బీరు సీసాలు పేలుతున్నాయి మంటలార్పేందుకు యత్నించిన డ్రైవర్ గాయాలపాలవడంతో.. స్థానికులు ఆ డ్రైవర్‌ను నంద్యాల ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి నంద్యాల కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లారీ నెంబర్ AP 21 TW 9242 గా గుర్తించారు.