అపార్ట్ మెంట్లో మంటలు : కారు రిపేర్ చేస్తుండగా స్పార్క్.. ఆరుగురు మృతి

అపార్ట్ మెంట్లో మంటలు : కారు రిపేర్ చేస్తుండగా స్పార్క్.. ఆరుగురు మృతి

హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ మొత్తం మంటలు వ్యాపించాయి.. ఆరుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయారు. ఇంత ప్రమాదానికి కారణం ఏంటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఓ చిన్న రిపేర్.. అదేనండీ కారు మరమ్మతులు చేస్తుండగా.. వచ్చిన ఓ స్పార్క్.. ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అయ్యింది అంటున్నారు పోలీసులు. అపార్ట్ మెంట్ కింద మెకానిక్ షెడ్ ఉంది.. అందులో ఓ కారు రిపేర్ చేస్తున్నారు.. ఇదే సమయంలో చిన్న స్పార్క్ వచ్చింది.. అది కారు పక్కనే ఉన్న డీజిల్ డబ్బాలపై పడింది.. వెంటనే మంటలు వ్యాపించాయి.. అపార్ట్ మెంట్ మొత్తాన్ని చుట్టుముట్టాయి..

దీంతో ఊపిరాడక ఆరుగురు చనిపోయినట్లుగా ప్రాధమికంగా గుర్తించామని పోలీసులు తెలిపారు.  ఇందులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లుగా చెప్పారు  ముగ్గురు గాయపడ్డారిని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు. పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసులకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు.   ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.