
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్ యెర్నేని క్లాప్ కొట్టగా, నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. సతీష్ కిలారు, అన్మోల్ శర్మ స్క్రిప్ట్ అందించారు. హారర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కౌశిక్ చెప్పాడు. రెగ్యులర్ షూటింగ్‌ను జులై 11నుంచి మొదలుపెట్టనున్నట్టు నిర్మాత తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సాయి శ్రీనివాస్ నటిస్తున్న 11వ సినిమా ఇది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’ చిత్రంలో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు.