మిస్టరీ వీడిందా : విదేశీ మహిళ హత్యలో.. హోటల్ సిబ్బంది అరెస్ట్

మిస్టరీ వీడిందా : విదేశీ మహిళ హత్యలో.. హోటల్ సిబ్బంది అరెస్ట్

బెంగళూరులోని జగదీష్ హోటల్ జరిగిన విదేశీ మహిళ హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు అస్సాంకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాబర్ట్, అమ్రిత్ ఇద్దరు జగదీష్ హోటల్ లో హౌజ్ కీపింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. ఉజ్బెకిస్తాన్ కు చెందిన జరీనా మార్చి 5, 2024 నాడు బెంగళూరుకు వచ్చి జగదీష్ హోటల్ లో స్టే చేస్తుంది.

కొన్ని రోజులుగా ఆమెపై కన్నేసిన రాబర్ట్, అమ్రిత్ ఇద్దరు ఓ రోజు హౌజ్ కీపింగ్ కోసం తన రూంకు వెళ్లి హౌజ్ కీపింగ్ అని చెప్పారు. ఇద్దరు ఎందుకు వచ్చారని జరీనా ప్రశ్నించిన పట్టించుకోకుండా రూంలోకి చొచ్చుకెళ్లారు. జరీనాను కొట్టి చంపి తన వద్ద ఉన్న విదేశి కరెన్సీని, సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. రూంకు గడియపెట్టి హోటల్ నుంచి హాడువుడిగా బయటకు వచ్చి కేరళకు పారిపోయారు.

హోటల్ సిబ్బంది సమాచారం మేరకు హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆదారంగా నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి 2000 రూపాయల విదేశి కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.