నా ఆటోనే.. నేను సిగరెట్ తాగితే నీకెందుకు : బెంగళూరు రోడ్డుపై వివాదం

నా ఆటోనే.. నేను సిగరెట్ తాగితే నీకెందుకు : బెంగళూరు రోడ్డుపై వివాదం

బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని అందరికీ తెలుసు కానీ ఎంతమంది దీనిని పాటిస్తున్నారంటే ఖచ్చితంగా చెప్పలేము. తాజాగా బెంగుళూరులో ఇదే విషయంలో ఓ బైకర్‌కి, ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే..  జేపీ నగర్ లో ఓ బైకర్,  ఆటోలో మరో వ్యక్తి వెళ్తున్నారు. ఆటోలో వెళ్తున్న వ్యక్తి సిగిరెట్ తాగుతూ బయటకు పొగను వదులుతున్నాడు ఈ క్రమంలో వెనకే వస్తున్న  బైకర్ కు ఇది ఇబ్బందిగా అనిపించడంతో  కాస్త ముందుకు వెళ్లి ఆ ఆటోను ఆపి ప్రయాణికుడితో  వాగ్వాదానికి దిగాడు.  

అతను తప్పై్ందని చెప్పక పోగా  బైకర్ పైకి ఎదురుదాడికి దిగాడు.  మీరు ఈ వీడియోను రికార్డు  చేసి  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి పాపులారిటీ పొందాలని ప్లాన్ చేస్తున్నారా... సెలబ్రిటీ అవుదామని అనుకుంటున్నారా అంటూ బైకర్ ను దబాయించాడు.  అంతంటితో ఆగకుండా  ఆటో డ్రైవర్ కు  లేని సమస్య మీకేంటీ..  ఆటోలో  నేను సిగరెట్ తాగితే నీకెందుకు అంటూ ఎదురు తిరిగాడు. ఏమైనా ఉంటే నేరుగా పోలీసులతో మాట్లాడండి అంటూ అతను  ఆటోలో వెళ్లిపోయాడు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో   పోలీసులు విచారణ చేపట్టారు.