నకిలీ స్వామీజీలు..రద్దయిన 2వేల నోట్లతో పూజలు..ఇలా చేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది..మా స్వామీజికీ అంత మహిహ ఉంది.. కావాలంటే చెక్ చేసుకోండి.. అని నకిలీ స్వామీజీ శిష్యుల ప్రచారం.. బిజినెస్ మ్యాన్ లే టార్గెట్.. ప్రత్యేకంగా ఆ సిరీస్ ఉన్న నోట్లే కావాలి అని కండిషన్స్.. అలా నమ్మించి లక్షల్లో వసూళ్లు.. ఇక్కడ నకిలీ స్వామీజీలు చేసిన చిన్న తప్పుతో అడ్డంగా దొరికారు. చివరికి ఇలా శ్రీకృష్ణ జన్మస్థానంలో..
ఏం జరిగింది..?
బెంగళూరులో బిజినెస్ మ్యాన్లకు నోట్ల వర్షం కురిపిస్తామని హామి ఇచ్చి లక్షల రూపాయలు మోసం చేసిన నకిలీ స్వామీజీలు, వారి అనుచరులను పోలీసులు రెస్ట్చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డిపాజిట్ కోసం వచ్చిన రూ. 2వేల కరెన్సీ నోట్లపై RBI అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ స్వామీజీల ముఠాలోని 10 మందిని హలసురు గేట్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి రూ. 18 లక్షలు నగదు సీజ్ చేశారు.
ఎలా జరిగిందంటే..
నకిలీ స్వామీజీలలో సత్యానంద స్వామి అలియాస్ బసవరాజ్,మల్లికార్జున, మోహన్ అలియాస్ మునిస్వామిలు.. తన అనుచరులతో బిజినెస్ మ్యాన్లను ఆకర్షించేవారు. కొన్ని ప్రత్యేక దినాలలో నోట్ల వర్షంకురిపించి మహిమలు మా స్వామీజీలకు ఉన్నాయని ప్రచారం చేశారు. ఇందుకోసం 2018లో RBI విడుదల చేసిన SH సిరీస్ నంబర్లు గల రద్దు చేయబడిన 2వేల నోట్లను ఉపయోగించి పూజ చేస్తే ఫలితం ఉంటుందని నమ్మబలికారు. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా బాధితులకు చెప్పారు. ఇలా మోసాలకు పాల్పడుతూ ఒక్కొక్కరినుంచి 4 లక్షలు వసూలు చేసేవారు.
ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే..రద్దు చేసిన 2వేల నోట్ల సిరీస్ నంబర్లు, నోట్ల వివరాలను ట్యాంపరింగ్ చేసి రిజర్వు బ్యాంకు లో జమచేసేందుకు యత్నించారు.
స్వామీజీల బాగోతం ఎలా బయటికి వచ్చిందంటే.. రిజర్వ్ బ్యాంకు అధికారులు హలసూరు గేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. మొదట ముగ్గురు నకిలీ స్వామీజీలను ఆ తర్వాత వారి అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నోట్లను ట్యాంపరింగ్ చేసి అసలు సూత్రధారిని యశ్వంతాపూర్ లో అరెస్ట్ చేశారు. అతడినుంచి ట్యాంపరింగ్ కు వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ 3న 10 మంది నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పరారీలో ఉన్న మహిళా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నారని వారు కూడా ఫిర్యాదు చేయొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు.
