నీళ్ల సమస్యతో తగ్గిన ఇంటి అద్దెలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం

నీళ్ల సమస్యతో తగ్గిన ఇంటి అద్దెలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం

మంచినీళ్లు.. ఇవి లేకపోతే జీవనమే లేదు.. పొద్దున లేచిన తర్వాత నీళ్లు లేకపోతే ఇక ఆ ఇంట్లో వారికి నరకమే.. మహిళలకు వంట కష్టాలు.. పిల్లలకు స్కూల్ ఇబ్బందులు.. పెద్దలకు ఆఫీసు హడావిడి అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది బెంగళూరు సిటీ.. బెంగళూరు అద్దెలు ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ ఏరియా అయిన వైట్ ఫీల్డ్ లో.. ఇప్పుడు జనం నీళ్లతో యుద్ధాలు చేస్తున్నారు. కోట్లకు కోట్ల రూపాయలు పెట్టి హైరైజ్ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేసి.. నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు జనం..

రెండు నెలలుగా బెంగళూరులో మంచినీటి కష్టాలతో.. ఐటీ కారిడార్ వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఒక్కో కుటుంబం నెలకు కనీసంలో ఆరు వేల రూపాయలను.. కేవలం నీళ్ల కోసం ఖర్చు చేస్తుందంట.. అపార్ట్ మెంట్ వాసులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుండటంతో.. ఒక్కో ఫ్యామిలీ అదనంగా 6 వేల రూపాయలు నీటి కోసమే చెల్లిస్తుంది.. దీంతో ఫ్యామిటీ మెయింటెనెన్స్ పెరిగి.. అద్దెకు ఉన్న వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారంట.. 

రెండు నెలల్లోనే బెంగళూరు సిటీ వైట్ ఫీల్డ్ లో ఇళ్లు ఖాళీ చేస్తున్న వారి సంఖ్య పెరగటంతో.. అద్దెలు భారీగా తగ్గాయంట.. కనీసంలో కనీసం 15 నుంచి 20 శాతం అద్దెలు తగ్గించారంట యజమానులు. నీటి ఇబ్బంది లేనప్పుడు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దె 27 నుంచి 30 వేల రూపాయలుగా ఉంటే.. ఇప్పుడు 20 వేల రూపాయలకే ఇస్తామని యజమానుల చెబుతున్నారంట.. కారణం.. 20 వేలకు తీసుకున్నా.. నీటి బిల్లు ఆరు వేల రూపాయలు అవుతుంది కదా.. అందుకే అద్దెలు తగ్గించారంట.. అయినా ఎవరూ ముందుకు రావటం లేదంట.. అద్దె తగ్గింది కదా అని ఇల్లు తీసుకుంటే.. మంచినీటి బిల్లు వాచిపోతుంది.. రోజూ నీళ్ల కోసం ఎక్కడ తిప్పలు పడతాం అంటూ చాలా మంది బెంగళూరు సిటీ శివార్లకు వెళ్లిపోతున్నారంట.. ఒకప్పుడు వైట్ ఫీల్డ్ లో ఇల్లు అంటే హాట్ కేక్.. ఇప్పుడు టూలెట్ బోర్డులు పెడుతున్నారంట యజమానులు. 

Also Read: ఎక్స్ కొత్త యూజర్లకు బిగ్ షాక్.. లైక్ కొట్టాలన్నా డబ్బు కట్టాల్సిందే

బెంగళూరు సిటీ శివార్లలో బోర్లు ఉన్న ప్రాంతంలో.. బోరు వాటర్ కు ఇబ్బంది లేని ప్రాంతాల్లో.. నీటి సమస్య లేని ప్రాంతాలకు షిఫ్ట్ అవుతున్నారంట వైట్ ఫీల్డ్ లో అద్దెకు ఉండే వారు.. రాబోయే రెండు, మూడు నెలలు కూడా బెంగళూరుకు మంచినీటి కష్టాలు తప్పవనే ఉద్దేశంలో ఉన్నారంట జనం..