డబ్బు, మద్యం పంపిణీపై దృష్టి పెట్టాలి: బేరా రామ్ చౌదరి

డబ్బు, మద్యం పంపిణీపై దృష్టి పెట్టాలి: బేరా రామ్ చౌదరి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ  చేసే వారిపై దృష్టి పెట్టాలని వ్యయ పరిశీలకుడు బేరా రామ్ చౌదరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​ మీటింగ్ హాల్​లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఓటర్లకు అందించే కానుకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రూ.10 లక్షల కంటే ఎక్కువగా బ్యాంకుల్లో నగదు జమ, విత్ డ్రా, ఆన్​లైన్ లో మల్టిపుల్  లావాదేవీలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇన్ కం టాక్స్, వాణిజ్య పన్నుల శాఖ, వ్యయ పరిశీలన శాఖలు ఎన్నికల వ్యయం నమోదులో సమన్వయంతో పని చేయాలన్నారు. కలెక్టర్ ఉదయ్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో 10 చెక్​పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. తనిఖీలను కలెక్టరేట్  నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నోడల్  ఆఫీసర్లు శ్రీనివాస్ బాబు, నర్సింగ్ రావు, రమాదేవి పాల్గొన్నారు.

చెక్ పోస్ట్  తనిఖీ

మాగనూర్: బార్డర్ లోని కృష్ణ మండలం వాసునగర్  చెక్ పోస్ట్ ను ఎన్నికల అబ్జర్వర్  అభిషేక్  దేవల్  పరిశీలించారు. కర్నాటక రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల తనిఖీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ లో నిరంతరం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ యోగేశ్​గౌతం తెలిపారు. బార్డర్ చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్  కోయ శ్రీహర్ష, ఏఎస్పీ నర్సింహారెడ్డి ఉన్నారు. 

వ్యయ పరిశీలకుడిగా సమీర్ కుమార్ ఝా

గద్వాల: అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్  కుమార్ ఝా శుక్రవారం గద్వాలకు వచ్చారు. కలెక్టర్  వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్​ స్వాగతం పలికారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్  నియోజకవర్గాల్లో అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు.