యూరియా కోసం ‘యాప్’ తప్పనిసరి : జిల్లా వ్యవసాయాధికారి బి. వెంకటేష్

యూరియా కోసం ‘యాప్’ తప్పనిసరి :  జిల్లా వ్యవసాయాధికారి బి. వెంకటేష్
  •     జిల్లా వ్యవసాయాధికారి బి. వెంకటేష్

అడ్డాకుల, వెలుగు :  యూరియా కోసం ‘యాప్’లో బుక్​ చేసుకోవడం తప్పనిసరి అని మహబూబ్​నగర్​ జిల్లా వ్యవసాయాధికారి బి. వెంకటేష్ సూచించారు. మూసాపేట మండలంలోని వివిధ ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై రైతులందరూ యూరియాను యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని, ఆ విధానంపై అవగాహన కల్పించారు.

యాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 64,230 మంది రైతులు 2,32,470 బస్తాల యూరియాను కొనుగోలు చేశారని తెలిపారు.  ప్రస్తుతం మరో 25,156 బస్తాలు బుకింగ్‌‌‌‌‌‌‌‌కు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.