కృత్రిమ కాలుతో అందాల పోటీలకు బెర్నాడెట్‌ 

కృత్రిమ కాలుతో అందాల పోటీలకు బెర్నాడెట్‌ 

కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని నిరూపించింది బెర్నాడెట్‌  హగన్స్ అనే యువతి. ఐర్లాండ్ కు చెందిన బెర్నాడెట్ హగన్స్..తన 22 ఏళ్ల వయసులో కీళ్ల క్యాన్సర్ బారిన పడింది. కుడికాలు తీసేయాల్సి వచ్చింది.దీంతో తనతో పాటు కుటుంబ సభ్యులు ఎంతో బాధ పడ్డారు. అయితే వచ్చిన వైకల్యంతో కుంగిపోకుండా.. తాను తేరుకుని..కుటుంబ సభ్యుల విచారాన్ని తొలగించేందుకు నడుం బిగించింది. మెల్లగా కృత్రిమ కాలుకు అలవాటు పడింది. ఇప్పుడు అదే కాలుతో ర్యాంప్ వాక్ చేయబోతోంది. దీంతో ఆ కుటుంబానికి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. తనకు అందాల పోటీలకు వెల్లాలని చిన్నప్పటి నుంచి ఉండేది.

బెర్నాడెట్‌ ఇష్టాన్ని గుర్తించిన జెబెడీ మేనేజ్‌మెంట్ అనే వికలాంగుల సేవా సంస్థ ఆమెకు అవసరమైన సహాయాన్ని, ధైర్యాన్ని సమకూర్చింది. ఆమె కలల సాకారానికి అండగా నిల్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ ఐర్లాండ్ పోటీల ఫైనలిస్టు లిస్టులో స్థానం ప్లేస్ సంపాదించింది. వచ్చే సెప్టెంబర్‌లో ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. కృత్రిమ కాలితో ర్యాంప్ వాక్ చేయబోతున్న మొట్టమొదటి మోడల్‌గా బెర్నాడెట్ చరిత్ర సృష్టించనుంది.