ఆకాశం నుంచి చల్లటి వాన చినుకులు కురవడం కామన్. అయితే ఉన్నట్టుండి ఆకాశం నల్లబడి, కార్లపై, ఇళ్లపై, రోడ్లపై జిడ్డుగా ఉండే నల్లటి 'నూనె వర్షం' కురిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ. సరిగ్గా ఇలాంటి ఒక వింత పరిస్థితినే ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో నగరవాసులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. నేరుగా మాస్కో నడిబొడ్డున పర్యావరణ విపత్తు రూపంలో వచ్చి పడింది.
ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి పొగ..
ఇటీవల ఉక్రెయిన్ చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడితో రష్యాపై విరుచుకుపడింది. దాదాపు 200 డ్రోన్లతో మాస్కో రీజియన్‌ను టార్గెట్ చేస్తూ జరిపిన ఈ దాడిలో ఒక భారీ ఆయిల్ రిఫైనరీ దాడికి గురైంది. ఆ పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. ఈ దాడిలో దాదాపు 17 మందికి పైగా గాయపడ్డారు. అయితే అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. రిఫైనరీ తగలబడటంతో ఆ చమురు రేణువులు గాల్లోకి లేచి, చివరికి నగర నివాస ప్రాంతాలపై క్రూడ్ ఆయిల్ వర్షం మాదిరిగా కురుస్తోంది.
Black rain falls on Moscow after a massive drone attack on its biggest oil refinery. pic.twitter.com/ZUYmqq1mTg
— Kate from Kharkiv (@BohuslavskaKate) June 18, 2026
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్థానికులు షేర్ చేసిన క్లిప్స్‌లో కార్లు, కిటికీలు, రోడ్లు అన్నీ ఒక నల్లటి, జిడ్డు పొరతో నిండిపోయి కనిపిస్తున్నాయి. జనాలు తమ చేతులతో ఆ నల్లటి ద్రవాన్ని తాకుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటకు వెళ్లిన వారి బట్టలపై నల్లటి మచ్చలు పడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
🌧️🇷🇺 Dark clouds rolled over Moscow as reports of black rain emerged after a massive Ukrainian drone attack.pic.twitter.com/D2zDBx3JiU
— Huzaifa Shafqat (@HuzaifaJanjua11) June 18, 2026
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ.. మున్సిపల్ అధికారులు మాత్రం మొదట్లో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. నగరంలో ఎలాంటి నల్లటి క్రూడ్ వర్షం కురవడం లేదని బుకాయించారు. కానీ నగర అధికారిక టెలిగ్రామ్ ఛానెళ్లు మాత్రం ఇందుకు భిన్నంగా అత్యవసర ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రజలు విషపూరిత పొగలను పీల్చకుండా ఉండేందుకు తమ ఇంటి కిటికీలను గట్టిగా మూసి ఉంచాలని అధికారులు ప్రజలకు సూచించారు. అలాగే చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీస్, వృద్ధులు, ఆస్తమాతో బాధపడేవారు వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని రష్యా ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ : యూనివర్సిటీలో సీటు వచ్చిన రోజే..
మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా దాదాపు 1,000 డ్రోన్లు, అనేక క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నామని ప్రకటించినప్పటికీ.. మాస్కో వీధుల్లో పడుతున్న నల్లటి ఆయిల్ చుక్కలు మాత్రం యుద్ధం తెచ్చిన పర్యావరణ నష్టాన్ని, దాని తీవ్రతను సామాన్య రష్యన్ పౌరుల ముంగిట స్పష్టంగా నిలబెట్టాయి.
