లేటెస్ట్టెక్నాలజీలతో రోగులకు ఉత్తమ చికిత్స: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు

లేటెస్ట్టెక్నాలజీలతో రోగులకు ఉత్తమ చికిత్స: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు
  • ఉదయ్ ఓమ్నీలో అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: లేటెస్ట్​ మెడికల్ ​టెక్నాలజీలతో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చని, త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్థోపెడిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రామా కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్​ ఉదయ్ ఓమ్నీలో ఏర్పాటు చేసిన 'అత్యాధునిక మిస్సో రోబోటిక్ సిస్టమ్​'ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ తెలంగాణకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలను తీసుకురావడంలో ముందంజలో ఉందన్నారు.

ఇక్కడ రోబోటిక్ సర్జరీ ప్రారంభించడం వల్ల ఎంతో మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థోపెడిక్ సంరక్షణ ప్రమాణాలు మరింత పెరుగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సర్జరీలు ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్నాయని, 2030 నాటికి మార్కెట్ 18 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా ఉందని మంత్రి వివరించారు.