హైదరాబాద్‎లోని కొంపల్లిలో బియాండ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ షురూ

హైదరాబాద్‎లోని కొంపల్లిలో బియాండ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ షురూ

హైదరాబాద్​, వెలుగు: స్మార్ట్ కిచెన్ టెక్నాలజీ బ్రాండ్ బియాండ్ అప్లయన్సెస్ తన తొలి ఎక్స్​పీరియన్స్ స్టోర్‎ను హైదరాబాద్‎లోని కొంపల్లిలో ప్రారంభించింది. ఆన్​లైన్ విక్రయాల్లో హైదరాబాద్ టాప్–3 మార్కెట్లలో ఒకటి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

వినియోగదారులు ఆండ్రాయిడ్ చిమ్నీలు, హాబ్ టాప్స్ వంటి ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి ఈ స్టోర్ వీలు కల్పిస్తుంది. రాబోయే  12 నెలల్లో ఈ ప్రాంతంలో అమ్మకాలను మూడు రెట్లు పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బెంగళూరు, ముంబై,  ఢిల్లీలోనూ ఇలాంటి స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు.