
కుత్బుల్లాపూర్: అగ్రికల్చర్ విద్యార్థుల తరుపున ఈరోజు మైనంపల్లి హనుమంత్ రావు మల్లారెడ్డి యూనివర్సిటీలోని రావటంపై యూనివర్సిటీ డైరెక్టర్, మాజీ మంత్రి మల్లా రెడ్డి కొడుకు భద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో భద్రా రెడ్డి, ప్రీతి రెడ్డి లు మాట్లాడారు. 70వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చి దిద్దుతున్న కాలేజ్ లోనికి వచ్చి, రౌడియుజం చేసి విద్యార్థుల జీవతాలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని భద్రారెడ్డి మండిపడ్డారు.
అగ్రికల్చర్ కోర్సులు చదువుతున్న కొంతమంది విద్యార్థుల తరుపున యూనివర్సిటీలోకి వచ్చి రాద్దాంతం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజకీయం బయట చేయండి.. పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని హితవు పలికారు. మరోసారి కాలేజ్ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని మైనంపల్లి హనుమంత్ రావును హెచ్చరించారు. గత పదేళ్లుగా రాని ఇబ్బందులు, ఈ రెండు నెలలుగా ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పదుతున్నరని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని వారు చెప్పారు.