భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి పుణ్యక్షేత్రంలో బెల్టు షాపులు పెట్టవద్దని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. మంగళవారం జీపీ ఆఫీస్లో సర్పంచ్ పూనెం కృష్ణదొర అధ్యక్షతన ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. భద్రాచలం పట్టణంలో బెల్టు షాపుల వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.
బెల్టుషాపులను ఎత్తివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోరారు.
