భద్రాచలం, వెలుగు: భద్రాచలం పంచాయతీ సర్పంచ్‌గా పూనెం కృష్ణదొర ఎన్నికయ్యారు. బీఆర్ఎస్అభ్యర్థి మానె రామకృష్ణపై1,684 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్థానిక డిగ్రీ కాలేజీలో శుక్రవారం తెల్లవారుజాము వరకు కౌంటింగ్జరిగింది. ముందుగా పంచాయతీలోని 20 వార్డుల ఓట్లను లెక్కించారు. ఒకటో వార్డులో తీవ్ర పోటీ ఉండగా, ఓట్లను రెండు సార్లు లెక్కించగా.. చివరకు కాంగ్రెస్అభ్యర్థి చెంచు సుబ్బారావు మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
14వ వార్డులో ఇండిపెండెంట్అభ్యర్థి ఇలమల అశోక్‌కుమార్, కాంగ్రెస్అభ్యర్థి అరికెల తిరుపతిరావుకు సమాన ఓట్లు పడ్డాయి. దీంతో టాస్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గాకుమారి ఒక ఓటుతో గెలిచారు. ఆయా వార్డుల్లో చివరివరకు లెక్కింపు ఉత్కంఠగా కొనసాగింది.
వార్డుల్లో 14 కాంగ్రెస్, సీపీఎం 2, సీపీఐ 1, టీడీపీ1, ఇండిపెం డెంట్1, బీఆర్ఎస్1 గెలిచాయి. అనంతరం సర్పంచ్ ఓట్ల కౌంటింగ్జరిగింది. మొత్తం19,838 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణదొరకు 8,416, బీఆర్ఎస్అభ్యర్థి మానె రామకృష్ణకు 6,732 ఓట్లు, మహాకూటమి అభ్యర్థి హరిశ్చంద్రనాయక్కు 2,756 ఓట్లు పడ్డాయి. చివరివరకు కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిపత్యాన్ని చూపారు.

