భద్రాద్రి రామయ్య భక్తులు అలెర్ట్ : భద్రాచలం టెంపుల్ లో తూర్పు ద్వారం నుంచే దర్శనాలు

  భద్రాద్రి రామయ్య భక్తులు అలెర్ట్ :   భద్రాచలం టెంపుల్ లో తూర్పు ద్వారం నుంచే దర్శనాలు
  • పడమర, దక్షిణం దిక్కుల నుంచి దర్శనాలు రద్దు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో తూర్పు ద్వారం వైపు నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. రూ.200 కోట్లతో తొలి దశ రామాలయం విస్తరణ పనుల్లో భాగంగా ప్రాకారాల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 

పడమర, దక్షిణం దిక్కుల నుంచి దర్శనాలు రద్దు చేశారు. ఇప్పటికే ఉత్తరద్వారం కూల్చివేశారు. పడమర, ఉత్తర దిక్కుల వైపు ప్రాకారాల కోసం పనులు చేపడుతున్న దృష్ట్యా తూర్పు వైపు నుంచే దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా మెట్లను నిర్మించి,  క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 

సమాచార కేంద్రం, సెల్​ఫోన్లు, బ్యాగులు పెట్టుకునే స్థలం, దర్శనాల టిక్కెట్ల కౌంటర్​ షెడ్లను కట్టారు. ఉచితం, రూ.100, రూ.300 స్పెషల్, ప్రొటోకాల్​ దర్శనాలకు క్యూలైన్లు నిర్మించారు. వాటిని ఈవో దామోదర్​రావు సోమవారం  ప్రారంభించారు.