హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో క్లెయిమ్చేయని పార్శిళ్లను వేలం వేస్తున్నట్టు కూకట్పల్లి డిపో మేనేజర్సునీత తెలిపారు. కూకట్పల్లి డిపోలో కార్గోలో పార్శిల్స్తీసుకెళ్లాల్సిందిగా వినియోగ దారులకు ఫోన్ద్వారా సమచారం ఇచ్చినా స్పందన రాకపోవడంతో మంగళవారం వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు.
డిపో ఆవరణలో మధ్యాహ్నం 2గంటల నుంచి జరిగే వేలంలో ఆటోమొబైల్ స్పేర్స్, క్లాత్, ఎలక్ట్రానిక్, జనరల్, ఎలక్ట్రికల్, స్టేషనరీకి సంబంధించి 24 రకాల వస్తువులను వేలం వేయనున్నట్టు తెలిపారు.
