కెనాల్స్ గడువులోగా పూర్తి చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

కెనాల్స్ గడువులోగా పూర్తి చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ ఆళ్లపల్లి, వెలుగు: జిల్లా అభివృద్ధిలో ప్రాజెక్టుల పురోగతి కీలకమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణపై పలు శాఖల అధికారులతో కలెక్టరేట్​లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ప్లాన్​ చేయాలన్నారు. అనంతరం ఆళ్లపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి, విద్యార్థుల హాజరు వివరాలపై ఆరా తీశారు. ప్రీ ప్రైమరీ, అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.