తిరువీర్ ‘భగవంతుడు’ నుంచి ఎల్లమ్మ పాట.. దైవిక స్వరంతో ఆకట్టుకుంటున్న సాంగ్  

తిరువీర్ ‘భగవంతుడు’ నుంచి ఎల్లమ్మ పాట.. దైవిక స్వరంతో ఆకట్టుకుంటున్న సాంగ్  

తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా  జి.జి.విహారి దర్శకత్వంలో రవి కుమార్ పనస నిర్మిస్తున్న చిత్రం ‘భగవంతుడు’.  కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నాడు. పీరియడ్  పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి దసరా సందర్భంగా సోమవారం సెకండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.  ‘‘ఓ ఎల్లమ్మా.. మా ఎల్లలు కాయమ్మా.. ఎల్లరికీ అమ్మ.. మా రేణుక ఎల్లమ్మా.. ” అనే పల్లవితో సాగే ఈ పాటను ఎస్. కృష్ణ ప్రసాద్ డివైన్ ట్యూన్‌‌తో కంపోజ్ చేయగా  అడ్డుల జంగిరెడ్డి పాడారు. ఈ పాటకు మూవీ డైరెక్టర్ జి.జి.విహారినే  లిరిక్స్ రాశాడు.  

‘ఎల్లమ్మ అంటే ఎవరనుకున్నరు?  సూర్యవంశ రాజులింట రేణుకమ్మ పుట్టెరా, దుర్గమ్మే వరమిచ్చిన ఆదిశక్తి అంశరా, అగ్గిలోంచి పుట్టినట్టి అయోనిజ తల్లిరా, జమదగ్నే మనువాడిన ముత్తైదువ అమ్మరా, తల్లి సేయి తాకి ఇసుక కడవయ్యి నిలుసురా, నాగుపాము తలనెక్కి తలపాగా సుట్టురా, నదులన్నీ ఒదిగొచ్చి కడవ నిండిపోవురా, వనవాసం కోసమని రాణీవాసం వదిలేసిన ధర్మపత్ని రేణుకమ్మరా..’  అంటూ భక్తిభావం నింపేలా సాగుతుందీ పాట.   వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను ప్రకటించనున్నారు.