
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Kartikeya Gummikonda) తన నెక్స్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం మొదలుపెట్టేశాడు. గతేడాది బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో చాలా రోజుల తరువాత మంచి హిట్ అందుకున్నారు. ఇక అప్పటినుండి ఈ హీరో నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్న వేల.. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కార్తికేయ. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి(Prashanth reddy)తో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను రిలీజ్ చేశాడు.
సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు.. భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam).. అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేయగా.. ఈ వీడియోని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. దీంతో ఈ టైటిల్ వీడియోపై ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. టైటిల్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా సరికొత్తగా కనిపిస్తున్నాడు కార్తికేయ. చేతిలో బ్యాట్ పట్టుకొని, వెనుక కారు, ఆ కారులో నోట్ల కట్టలతో.. ఇంట్రెస్టింగ్ గా ఉంది పోస్టర్.
ఇవన్నీ చూస్తుంటే కొత్త కంటెంట్ తో రేసీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రానుందని క్లియర్ గా అర్థమవుతోంది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కార్తికేయకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.