భంగోరియా ఫెస్టివల్.. యూత్ లవ్ ప్రపోజ్ చేసే పండుగ

భంగోరియా ఫెస్టివల్.. యూత్ లవ్  ప్రపోజ్ చేసే పండుగ


భగోరియా ఫెస్టివల్.. దీనిని భంగోరియా పండుగ అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని గిరిజన ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు.ఇందులో భిల్, భిలాలా, పటేలియా వంటి గిరిజన తెగలు పాల్గొంటాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని బర్వానీ, ధార్, అలీరాజ్ పూర్, ఖర్గోస్, ఝబువా జిల్లాల్లో ఈ పండుగను గిరిజన తెగలు ఈ పండుగను జరుపుకుంటారు. ఏడు రోజుల నుంచి జరుగుతున్న ఈ భంగోరియా పెస్టివల్ ఆదివారం (మార్చి 24) తో ముగియనుంది. ఈ సందర్భంగా భంగోరియా పండుగ గురించి , గిరిజనులు ఈ పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసు కుంటారు..ఈ పెస్టివల్ ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం.. 

భంగోరియా పండుగ గిరిజన సాంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో హోళీ సమయంలో భంగోరియా పండుగను వైభవంగా జరుపుకుంటారు గిరిజనులు. హోలీ ముందు రోజువరకు ఏడురోజుల పాటు జరిగే ఈ పండుగ గిరిజనులకు ప్రధాన పండుగ. గిరిజన యువకులు, యువతులు సామూహికంగా డోల్, మండల్ దరువులతో డ్యాన్సులు చేస్తారు. ఫ్లూట్స్ ఊదుతూ పాటలు పాడుతారు. 

అంతేకాదు ఈ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది..పెళ్లి చేసుకోవాలనుకునే యువతీయువకులకు దారి చూపిస్తుంది. గిరిజన సాంప్రదాయం ప్రకారం.. భంగోరియా పెస్టివల్ లో గిరిజన యువతీ యువకులు పెళ్లి చేసుకునేందుకు వారికి తగిన జోడిని సెలెక్ట్ చేసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకునే యవతీ యువకులు వారికి ఇష్టమైన, సరియైన జోడిని ఈ పండుగ ద్వారా సెలక్ట్ చేసుకుని ఒకటవుతారు. పెళ్లి కానీ యువతి లేదా యువకుడు తాను ఇష్ట పడుతున్న వారి నుదిటిపై బొట్టు పెడతారు..అది వారికి నచ్చితే తిరిగి  బొట్టు పెట్టి అంగీకారం తెలుపుతారు.  ఈ ఏడాది భంగోరియా పెస్టివల్ మార్చి 18న ప్రారంభమయింది.. మార్చి 24తో ముగుస్తుంది.