భవన నిర్మాణ రంగంలో అతిపెద్ద ఎక్స్‌పో..ఢిల్లీలో భారత్ బిల్డ్‌కాన్ సందడి

భవన నిర్మాణ రంగంలో అతిపెద్ద ఎక్స్‌పో..ఢిల్లీలో భారత్ బిల్డ్‌కాన్ సందడి

న్యూఢిల్లీ: భారత్ బిల్డ్‌‌‌‌‌‌‌‌కాన్ 2026 ప్రదర్శన  ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో గురువారం ఘనంగా ప్రారంభమైంది. భవన నిర్మాణ సామగ్రి రంగంలో ఇది అతిపెద్ద ఎక్స్‌‌‌‌‌‌‌‌పో అని నిర్వాహకులు ప్రకటించారు. మొదటి రోజే 90కి పైగా దేశాల నుంచి, 100కు పైగా భారతీయ నగరాల నుంచి 25 వేల మంది సందర్శకులు హాజరయ్యారు.

భారతదేశ నిర్మాణ రంగానికి జీడీపీలో తొమ్మిది శాతం వాటా ఉంది. ఇది 5.10 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది.  రూ. 56 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ రంగం, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా. 

ఈ ప్రదర్శనలో సిరామిక్ స్టీల్ వంటి 24 వర్గాల ఉత్పత్తులను ప్రదర్శించారు. అంతర్జాతీయ కొనుగోలుదారులు, పంపిణీదారులు ఈ వేదిక ద్వారా భారతీయ తయారీదారులతో అనుసంధానం అవుతున్నారు.