బీఈఎంఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఐటీఐ చేసినోళ్లకు ఇదే మంచి ఛాన్స్..

బీఈఎంఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఐటీఐ చేసినోళ్లకు ఇదే మంచి ఛాన్స్..

భారత్ ఎర్త్ మూవర్స్(బీఈఎంఎల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. 
  
పోస్టుల సంఖ్య: మొత్తం 440. 

పోస్టులు: ఐటీఐ(ఫిట్టర్) 189, ఐటీఐ(టర్నర్) 95, ఐటీఐ (వెల్డర్) 91, ఐటీఐ (మెషినిస్ట్) 52, ఐటీఐ (ఎలక్ట్రీషియన్) 13.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్ 29 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 34 ఏండ్లు, ఓబీసీలకు 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ ‌05. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు cbtexam.bemlindia.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.