BEMLలో భారీగా ఉద్యోగులు.. బీటెక్ పాసైన నిరుద్యోగులు వెంటనే అప్లయ్ చేసుకోండి..

BEMLలో భారీగా ఉద్యోగులు.. బీటెక్ పాసైన నిరుద్యోగులు వెంటనే అప్లయ్ చేసుకోండి..

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 26,   

పోస్టుల సంఖ్య: 119.

పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (మెకానికల్) 88, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (ఎలక్ట్రికల్) 18, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (మెటలార్జీ) 02, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (ఐటీ) 01, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (ఫైనాన్స్) 08, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్  (రాజ్ భాషా) 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్/ ఎలక్ట్రికల్/ మెటలర్జీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా మాస్టర్ ఆఫ్​ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేసి ఉండాలి. 
సీఏ ఇంటర్/ సీఎంఏ ఇంటర్/ ఫైనాన్స్ కోర్ సబ్జెక్టుగా కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్​ ఒక సబ్జెక్టుగా హిందీలో ఎంఏ పూర్తి చేసి ఉండాలి. లేదా హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్​​లో ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు cbtexam.bemlindia.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.