
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్(బెల్) మూడు విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 13.
పోస్టుల సంఖ్య: 20 (ప్రాజెక్ట్ ఇంజినీర్1).
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో నాలుగేండ్ల ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభ తేదీ: ఆగస్టు 20.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 13.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.472.
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. క్వాలిఫై మార్కులు 35 శాతం (జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ), 30 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ)గా నిర్ణయించారు.