BELలో ఇంజినీర్ పోస్టులు: బిటెక్ పాసైనోళ్ళకి ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

 BELలో ఇంజినీర్ పోస్టులు: బిటెక్ పాసైనోళ్ళకి ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), హైదరాబాద్  ట్రైనీ ఇంజినీర్–I, ప్రాజెక్ట్ ఇంజినీర్–I పోస్టుల భర్తీకి నోటిఫికేషిన్ విడుదల చేసింది. ఈ పోస్టులను పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అమలు చేయడానికి తాత్కాలిక ప్రతిపాదికన నియమిస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 12. 

పోస్టుల సంఖ్య: 80.

పోస్టులు: ట్రైనీ ఇంజినీర్–-I (ఎలక్ట్రానిక్స్) 55, ట్రైనీ ఇంజినీర్–-I (మెకానికల్) 11, ట్రైనీ ఇంజినీర్–-I (కంప్యూటర్ సైన్స్) ‌‌‌‌01, ప్రాజెక్ట్ ఇంజినీర్–-I (ఎలక్ట్రానిక్స్) 06, ప్రాజెక్ట్ ఇంజినీర్–-I (మెకానికల్) 04, ప్రాజెక్ట్ ఇంజినీర్–-I (కంప్యూటర్ సైన్స్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్–-I  (ఎలక్ట్రికల్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్–-I (సివిల్) 01.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్​లో నాలుగేండ్ల బి.టెక్/ బీఈ, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజినీర్-–I- పోస్టులకు కనీసం రెండేండ్ల  ఇండస్ట్రియల్ ఎక్స్​పీరియన్స్ ఉండాలి. 

వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్-–-I పోస్టులకు 28 ఏండ్లు,  ప్రాజెక్ట్ ఇంజినీర్-–-I పోస్టులకు 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 28.

అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్-–I రూ.177. ప్రాజెక్ట్ ఇంజినీర్–--I రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

లాస్ట్ డేట్:  సెప్టెంబర్ 12. 

రాత పరీక్ష: సెప్టెంబర్ 14.

పర్సనల్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 15.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

ఎగ్జామ్ ప్యాటర్న్: ట్రైనీ ఇంజినీర్–I/ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.  ప్రాజెక్ట్ ఇంజినీర్–I/ ఆఫీసర్ పోస్టులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష 85 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.  రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.